![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -218 లో.. కృష్ణ సన్మానానికి నందు గౌతమ్ వస్తారు. నందు భవానీతో మాట్లాడగా భవాని ఎమోషనల్ అవుతుంది. నాకు మన ఇంటికి రావాలని ఉంది అమ్మ.. మీ అందరితో కలిసి ఉండాలని ఉందని నందు అనగానే.. నీ ఇంటికి నువ్వు రావడానికి, నువ్వు అడగమేంటమ్మ అని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది భవాని. థాంక్స్ కృష్ణ.. నీ వల్లే నా కూతురు ఈ రోజు నా దగ్గరికి వచ్చిందని భవాని అంటుంది.
ఆ తర్వాత అందరు సన్మానం దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. అయితే అప్పుడే మురారికి ఏదో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తాడు. శ్రీనివాస్ సన్మానం దగ్గరికి వస్తుండగా మురారి చూస్తాడు. అతనితో మాట్లాడతాడు. మీరు కావాలనే ఆదర్శ్ రావట్లేదని పెద్దమ్మతో చెప్పారట ఎందుకని శ్రీనివాస్ ని అడుగుతాడు మురారి. " అవును చెప్పాను నీ ప్రేమ గురించి భవాని గారికి తెలియాలని అలా చెప్పాను" అని శ్రీనివాస్ అంటాడు. మురారి మౌనంగా ఉంటాడు.
నీ వల్లే నా కూతురు జీవితం అలా అయింది. కృష్ణది నీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి మళ్ళీ ముకుంద మనసులో ఆశలు రేపావ్... నా కూతురు ఏదైనా చేసుకున్నా.. తనకు ఏదైనా జరిగిన నువ్వే బాధ్యుడివి. నువ్వు మాత్రమే బాధ్యుడివని మురారికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు శ్రీనివాస్. ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. నువ్వు అదంతా ప్రేమతో కాకుండా బాధ్యత చేసావని కృష్ణ అనుకుంటుందని ముకుంద చెప్తుంది. నీ పట్ల కృష్ణకి గౌరవం తప్ప ప్రేమ లేదని ముకుంద చెప్పి వెళ్తుంది. మరొక వైపు సన్మానం భవాని చేతులు మీదుగా మొదలు అవుతుంది. ఆ తర్వాత భవాని కృష్ణ డాక్టర్ కావడానికి పడ్డ కష్టాన్ని చెప్తుంది. నేనేం చెప్పాలని అనుకున్నానో కరెక్ట్ గా పెద్దమ్మ కూడా అదే చెప్పిందని మురారి అనుకుంటాడు.
మొదటగా గౌతమ్ వెళ్లి కృష్ణ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత కృష్ణ స్టేజి పైకి వెళ్లి మాట్లాడుతుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా ఏసీపీ సర్ అని చెప్తుంది. ఆయన బాధ్యతగా తీసుకొని నన్ను చదివించారని కృష్ణ చెప్పగానే.. వెనకాల నిల్చొని ఉన్న మురారి దగ్గరికి ముకుంద వెళ్ళి .. చూసావా నీపై ప్రేమ ఉంటే ఇలా బాధ్యత అనే పదం వాడదు కదా? నీపై గౌరవం మాత్రమే ఉందని మురారితో ముకుంద చెప్తుంది. మురారి డల్ అయిపోతాడు. నా మనసులో మీపై ప్రేమని ఈ రకంగా చెప్పాను ఏసీపీ సార్ అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మా రేవతి అత్తయ్య నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుందని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |